PM Modi : కేంద్రం గుడ్ న్యూస్.. ఇంటింటికీ మోదీ ఫ్రీ కరెంట్
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. భారతదేశ సుస్థిర అభివృద్ధిలో భాగంగా.. సూర్య ఘర్ (ఇంటింటికీ ఉచిత కరెంట్) అనే పథకానన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని మోదీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత కరెంట్ అందించడమే ఈ పథకం లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. ఈ పథకానికి రూ.75వేల కోట్లు ఖర్చవుతుండగా.. దేశంలోని కోటి మందికి లబ్దిచేకూరనుంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం సెన్సేషనల్ గా మారింది.
In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every month.
— Narendra Modi (@narendramodi) February 13, 2024