శివతత్వానికి ప్రతిబింబం.. వారణాసి క్రికెట్ స్టేడియం

By :  Bharath
Update: 2023-09-23 11:38 GMT

క్రికెట్ ను ఆరాధించే దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో ఏ క్రీడకు లేనంత అభిమానులు, ఆధరణ క్రికెట్ కు ఉంది. అందుకే ప్రతీ నగరాల్లో క్రికెట్ స్టేడియాలు ఉంటాయి. అయితే మరికొన్ని నెలల్లో దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. శనివారం (సెప్టెంబర్ 23) వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ఈ స్టేడియానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, రాజీవ్ శుక్లా, సెక్రెటరీ జై షా, రవిశాస్త్రి పాల్గొన్నారు.

శివతత్వం ఉట్టిపడేలా..:

వారణాసి క్రికెట్ స్టేడియాన్ని భిన్నంగా రూపొందించనున్నారు. శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. త్రిశూలాన్ని పోలిన ప్లడ్‌లైట్లు, శివుడి చేతిలో ఉండే ఢమరుకంలా పెవిలియన్ స్టాండ్‌, గంగా ఘాట్‌ మెట్ల మాదిరిగా ఉండే ప్రేక్షకుల గ్యాలరీ ఈ స్టేడియం ప్రత్యేకత. అంతేకాకుండా స్టేడియం ప్రవేశ ద్వారంలో బిల్వ పత్రం ఆకును పోలి ఉండే మెటాలిక్ షీట్ ను ఏర్పాటు చేస్తారు. స్టేడియం పై కప్ప అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. ఈ స్టేడియం నిర్మించే 121 ఎకరాల భూసేకరణకు యూపీ ప్రభుత్వం రూ.121 కోట్లు వెచ్చించింది. స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చుకానుంది. ఈ స్టేడియం పూర్తయితే కాన్పూర్, లక్నో తర్వాత యూపీలోని మూడో స్టేడియం అవుతుంది. 2025, డిసెంబర్ నాటికల్లా ఈ స్టేడియం అందుబాటులోకి రానుంది.

Tags:    

Similar News