సౌదీ యువరాజుతో మోదీ కీలక భేటీ

By :  Aruna
Update: 2023-09-11 10:25 GMT

సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ భారత్‎లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ యువరాజుతో భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ద్వైపాక్షిక చర్చలను నిర్వహించారు. ఈ కీలకమైన భేటీలో వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, సాంస్కృతిక సహకారంపై ప్రధానంగా ఇరు నేతలు చర్చించారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. భారత దేశానికి అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని ఈ సందర్భంగా మోదీ అన్నారు. గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పని చేస్తాయని సౌదీ యువరాజు తెలిపారు.

మోదీ మాట్లాడుతూ.." రెండు దేశాల పార్టనర్‎షిప్‎ను మరింత బలోపేతం చేసేందుకు విభిన్న మార్గాలను అన్వేషిస్తున్నాము. ప్రపంచ సంక్షేమం కోసం ఈ రెండు దేశాల భాగస్వామ్యం అత్యంత కీలకం. కాలానికి అనుగుణంగా మా సంబంధాలకు కొత్త కోణాన్ని జోడిస్తున్నాం. ఈ పార్టనర్‎షిప్‎ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం" అని మోదీ అన్నారు.

ఇక సౌదీ యువరాజు మాట్లాడుతూ.." భారత్‌లో పర్యటించడం ఆనందంగా ఉంది. జీ20 వంటి సదస్సులను నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. జీ20తో ప్రపంచమంతా ఎన్నో ప్రయోజనాలను పొందుతుంది. ఈ సదస్సులో కీలకమైన ప్రకటనలు చేసే ఛాన్స్ దక్కింది.భారత్, సౌదీ ఈ రెండు దేశాలు గొప్ప భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పనిచేస్తాయి"అని యువరాజు తెలిపారు. భారత్‌లో మహ్మద్‌ బిన్‌ పర్యటించడం ఇది రెండోసారి.


Tags:    

Similar News