ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు. జులై 8న ప్రధాని వరంగల్‌లో పర్యటించనున్నారు. కాజీపేట వ్యాగన్ ఓవర్‌హాలింగ్ సెంటర్‌కు, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభకు కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు .రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల భోపాల్ లోని ఓ కార్యక్రమంలో బీఆర్ఎస్ది కుటుంబ పాలన అంటూ మోదీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.