PM Suryodaya Yojana:కోటి ఇళ్లకు సోలార్ వెలుగులు.. శ్రీరాముడి ఆశీస్సులతో పీఎం కొత్త పథకం

Byline :  Veerendra Prasad
Update: 2024-01-23 02:16 GMT

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు.దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్‌ ఉత్పత్తి పెంచేందుకు గాను ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నామని ప్రధాని మోదీ సోమవారం తెలిపారు. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం తన నివాసానికి వెళ్తున్న సమయంలో పీఎం మోదీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద దేశంలోని ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేసి తెలియజేశారు.

“ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశానికి చెందిన భగవంతుడు శ్రీరాముడి నుంచి శక్తిని పొందుతారు. ఈరోజు, అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది. అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను తీసుకున్న మొదటి నిర్ణయం ఏమిటంటే.. మా ప్రభుత్వం ఒక కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ని ప్రారంభించనుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్ బిల్లును తగ్గించడమే కాకుండా, ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా చేస్తుంది’’ అని నరేంద్ర మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

దేశంలో సుమారు కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్‌ రూఫ్‌ టాప్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని తెలిపారు. ఈ పథకం పేద, మధ్యతరగతి చెందినవారికి కరెంట్‌ బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్‌ రంగంలో భారత దేశ స్వావలంబనను పెంచుతుందని పేర్కొన్నారు. ఇక.. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్‌ రూఫ్‌ టాప్‌ సిస్టం ప్యాలెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఈ ఫొటోలను ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Tags:    

Similar News