Ayodhya Railway Station : అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోడీ

Byline :  Kiran
Update: 2023-12-30 07:28 GMT

ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్‌ను ప్రధాని ప్రారంభించారు. దాదాపు రూ. 240కోట్ల వ్యయంలో మూడు అంతస్థుల్లో ఈ స్టేషన్ ను ఆధునీకరించారు. ప్రయాణికుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, షాపులు, వెయిటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు.

అనంతరం మోడీ రెండు అమృత్‌ భారత్‌, ఆరు వందే భారత్‌ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు అమృత్‌ భారత్‌ రైల్లోకి వెళ్లి కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్‌ విశేషాలను మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రధాని మోడీకి వివరించారు.

అంతకు ముందు అయోధ్యకు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మెగా రోడ్ షోలో పాల్గొన్నారు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు సాగిన రోడ్ షోలో దారి పొడవునా ప్రజలు మోడీకి స్వాగతం పలికారు. దాదాపు 1400 మంది కళాకారులతో తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.

ప్రధాని మోడీ మధ్యాహ్నం అయోధ్యలోని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభిస్తారు. అనంతరం ఎయిర్‌పోర్టు పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసిన ‘జన్‌ సభ’లో పాల్గొంటారు. ఈ సభకు దాదాపు లక్షన్నర మంది జనం హాజరయ్యే అవకాశముంది.




Tags:    

Similar News