ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు తీసుకోండి.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

By :  Kiran
Update: 2023-10-24 16:43 GMT

దేశంలోని ప్రతి చెడుపై దేశభక్తి సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సమాజంలోని కులతత్వం, ప్రాంతీయతత్వం వంటి వక్రీకరణల్ని రూపుమాపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకలో మంగళవారం జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ.. డెవలప్డ్ ఇండియా కోసం ప్రతి ఒక్కరూ 10 ప్రతిజ్ఞలు చేయాలని పిలుపునిచ్చారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని చెప్పారు. రావణ దహనమంటే కేవలం గడ్డిబొమ్మను దహనం చేయడం కాదని, భరతమాతను కులం, ప్రాంతీయవాదం పేరుతో విడగొట్టాలని చూసే శక్తుల అంతం అని అన్నారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ప్రజలంతా 10 ప్రతిజ్ఞలు చేయాలని మోడీ పిలుపునిచ్చారు.

మోడీ చెప్పిన 10 ప్రతిజ్ఞలు ఇవే..

1.భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయాలి.

2.డిజిటల్ చెల్లింపు వ్యవస్థల వినియోగానికి ప్రజలను సంసిద్ధులను చేయడం.

3.గ్రామాల పరిశుభ్రత పట్ల నిబద్ధతతో ఉండటం.

4.స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం

5. పనిలో నైపుణ్యం, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ

6. స్వదేశంలో పర్యటించడం, ఆ తర్వాతే ప్రపంచం విహారం.

7.ప్రకృతి వ్యవసాయం గురించి రైతులను జాగృతం చేయడం

8.రోజువారీ ఆహారంలో మిల్లెట్లను చేర్చుకోవడం.

9. ప్రతి ఒక్కరు పర్సనల్ ఫిట్నెస్పై దృష్టి పెట్టాలి.

10. ప్రతి ఒక్కరూ ఒక్కో పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి.


Tags:    

Similar News