చర్చిలో క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ

By :  Bharath
Update: 2023-12-25 11:50 GMT

చర్చిలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. చిన్న తనంలో తనకు క్రైస్తవులతో సత్సంబంధాలు ఉండేవని చెప్పుకొచ్చారు. విద్య, వైద్య రంగంలో క్రైస్తవులు ఎన్నో సేవలందిస్తున్నారని, పేదలకు సేవ చేయడంలో వారెప్పుడూ ముందుంటారని మోదీ కితాబిచ్చారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనేదనే ఏసు క్రీస్తు ఆశయమని ఆయన చెప్పుకొచ్చారు. సమాజానికి సేవ, మానవాళిపై కరుణ అనేవి క్రీస్తు సందేశాలని అన్నారు. ఉన్నత విలువలు పాటిస్తూ వారసత్వ రక్షణపై మనం దృష్టి పెట్టాలని సూచించారు. పరస్పర సహకారం, సమన్వయంతో మనం ముందుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు.


Tags:    

Similar News