ప్రధాని నరేంద్ర మోదీ స్వయాన ప్రకృతి ప్రేమికులు. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో ఆయన బుధవారం లక్షద్వీప్ లో పర్యటించారు. అక్కడి నేషర్ ను ఎంజాయ్ చేశారు. సముద్రం ఒడ్డున కూర్చొని కాసేపు సేద తీరారు. అంతేకాకుండా అక్కడ సముద్రంలో స్నార్కెలింగ్ (స్కూబా డైవింగ్ లాంటిది) చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంతో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి’ అని ట్వీట్ లో చెప్పుకొచ్చారు.