ఎస్ఐని గుడ్డలు ఊడదీసి చితకబాదిన ఊరోళ్లు..

Update: 2023-09-19 11:41 GMT

అర్ధరాత్రి ఓ ఇంటి పైకప్పు తొలగించి నిద్రపోతున్న యువతిపై అత్యాచారానికి ప్రయత్నించిన ఓ ఎస్ఐ జనంలో చావు దెబ్బలు తిన్నాడు. బాధితురాలు కెవ్వుమని అరవడంతో ఇంట్లో వేరే గదుల్లో పడుకుని ఉన్న కుటుంబసభ్యులు ఎస్ఐని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. తర్వాత ఊరి ప్రజలు కూడా అక్కడికి చేరుకుని బట్టల విప్పి చితగ్గొట్టారు. కర్రలతో, కాళ్లు చేతులతో దాడి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఆదివారం సంఘటన జరిగింది. బడితపూజ చేస్తుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాధితురాలు.. బర్హాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అత్యాచార యత్నం కేసు నమోదైంది. నిందితుడు సందీప్ కుమార్‌ను విధుల నుంచి తప్పించారు. అయితే సందీప్ కుమార్ తను ఏ తప్పూ చేయలేదని అంటున్నాడు. ఓ కేసే దర్యాప్తు కోసం వెళ్లడంతో జనం పట్టుకుని అన్యాయంగా కొట్టారంటున్నాడు. సందీప్ రెండేళ్ల కిందటే ఎస్ఐ కొలువులో చేరాడు. అతడు తరచూ తమ గ్రామంలోకి అనుమానాస్పదంగా తిరిగేవాడని స్థానికులు చెప్పారు.

Tags:    

Similar News