పోస్టర్ వార్.. శరద్ పవార్ vs అజిత్ పవార్

Update: 2023-07-06 06:25 GMT

మహారాష్ట్రలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో సంక్షోభం పూటకో మలుపు తిరుగుతోంది. పార్టీ తమదంటే తమదని బాబాయి, అబ్బాయిలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తున్నారు. అధ్యక్షుడు శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసిన ఆయన సోదరుడి కొడుకు అజిత్ పవార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి శరద్‌ పవార్‌ను తొలిగించినట్టు వెల్లడించారు. తిరుగుబాటుకు రెండు రోజుల ముందే ఎన్సీపీ కొత్త అధ్యక్షుడిగా అజిత్‌ను ఎన్నుకున్నట్లు ఆయన వర్గం కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ సమర్పించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బుధవారం ఇరు వర్గాలు ఎమ్మెల్యేల బల ప్రదర్శన జరిగిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.




 


ఈ నేపథ్యంలోనే ఈ గొడవలోకి బాహుబలి ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాహుబలి అంటే ప్రభాస్ కాదు. బాహుబలికి సంబంధించిన ఓ పోస్టర్ ను రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఎన్‌సీపీ వర్సెస్ ఎన్‌సీపీ సంక్షోభం మధ్య రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రంలోని ఒక సన్నివేశంపై రూపొందించిన పోస్టర్‌ను ప్రదర్శించింది. ఆ సినిమాలో అమరేంద్ర బాహుబలిని కట్టప్ప వెనుక నుంచి పొడిచిన చిత్రాన్ని ప్రదర్శించింది. ఇక నమ్మక ద్రోహానికి ఈ చిత్రం ప్రతీక అని, అజిత్ పవార్ ను విమర్శిస్తూ రాష్ట్రవాది విద్యార్థి కాంగ్రెస్ ఈ పోస్టర్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 




Tags:    

Similar News