Prashant kishor : పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్.. కానీ నితీష్కు.. : పీకే

Byline :  Krishna
Update: 2024-01-30 05:55 GMT

బిహార్ సీఎం నితీష్ కుమార్ కూటమి మార్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమిని వీడి బీజేపీతో జతకట్టారు. దీంతో బిహార్ లో ఆదివారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నితీష్ కూటమిని మార్చడంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ ఆర్జేడీ,ఆప్ సహా పలు పార్టీలు ఆయన నిర్ణయాన్ని తప్పుపట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నితీష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నితీష్ పెద్ద మోసగాడు అని మండిపడ్డారు. ఆయనకు ఇదే ఆఖరి అవకాశం అని.. ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన కన్పించరని చెప్పారు.

నితీష్ రాజకీయాల్లో చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారని పీకే అన్నారు. ఆయనను బిహార్ ప్రజలు తిరస్కరించారని చెప్పారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు 20 సీట్ల కంటే ఎక్కువ రావని అన్నారు. నితీష్ ఏ కూటమిలో ఉన్నా ఆయన పార్టీకి 20సీట్లకు మించి రావని వ్యాఖ్యానించారు. ఒకవేళ 20 కంటే ఎక్కువ సీట్లు వస్తే తన వృత్తిని వదిలేస్తానని సవాల్ విసిరారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. అయితే బిహార్లో నితీష్తో కలవడం బీజేపీకే నష్టమని చెప్పారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే అంతకంటే ఎక్కువ సీట్లు గెలిచే స్థితిలో ఉండేదని అన్నారు.


Tags:    

Similar News