గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సంవత్సరాల్లో భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో)కు తగినంత నిధులు కేటాయించలేదనీ, ప్రభుత్వానికి ఇస్రోపై నమ్మకం లేదని అన్నారు ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. ఇస్రో తొలినాళ్ల గురించి ఆయన మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ఇస్రోకు కేటాయించిన నిధుల గురించి ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వీడియోను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) షేర్ చేసింది.
ఇస్రో విశ్వసనీయతను నిరూపించుకున్న తర్వాతే అంతరిక్ష సంస్థకు ప్రభుత్వం నిధులు ఇచ్చిందని నంబి నారాయణన్ తెలిపారు. "మా దగ్గర జీపు లేదు. మాకు కారు లేదు. మా దగ్గర ఏమీ లేదు. అంటే మాకు బడ్జెట్ కేటాయింపులు లేవు. అది మొదట్లోనే జరిగింది' అని అన్నారు. "బడ్జెట్ అడిగేందుకు కాదు, ఇచ్చారు. దీనిపై తాను ఫిర్యాదు చేయనని, కానీ వారికి (ప్రభుత్వానికి) మీపై (ఇస్రో) నమ్మకం లేదని" అన్నారు.
చారిత్రాత్మక మూన్ మిషన్ ల్యాండింగ్ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నంబి నారాయణన్ స్పందిస్తూ చంద్రయాన్ -3 వంటి జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని కాకపోతే ఇంకెవరికి క్రెడిట్ దక్కుతుందని ప్రశ్నించారు. "జాతీయ ప్రాజెక్టులోకి వెళితే ఇంకెవరికి క్రెడిట్ దక్కుతుంది. ఆయనే ప్రధాని. ప్రధాని అంటే మీకు నచ్చకపోవచ్చు. అదే మీ సమస్య' అని నంబి నారాయణన్ అన్నారు. స్పేస్ సైంటిస్టులకు సకాలంలో జీతాలు అందడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం ఉందా అని ఇస్రో మాజీ శాస్త్రవేత్తను ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ.. జీతాలు, పింఛన్ల జమలో ఎలాంటి జాప్యం జరగలేదనీ, ప్రతి నెలా 29వ తేదీన పింఛన్ వస్తుందని నంబి నారాయణన్ చెప్పారు.