బంగారం ధర మళ్లీ పెరిగింది. గతకొంత కాలంగా తగ్గిన బంగారం ధర.. సోమవారం ఒక్కరోజే భారీగా పెరిగింది. భారత బులియన్ మార్కెట్ లో 24 క్యారట్ల బంగారం ధర తులం రూ.800 పెరిగి రూ. 57,425.. 18 క్యారట్ గోల్డ్ రూ.43,062 వద్ద నిలిచింది. ఇజ్రాయెల్ పై పాలస్తీనా హమాస్ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బంగారం, ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. మరోవైపు కిలో వెండి ధర రూ. 1800 పెరిగి రూ.67,095 వద్ద నిలిచింది. యుద్ధం కారణంగా భవిష్యత్తులో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ. 58 వేలు, కిలో వెండి ధర రూ.70 వేలు దాటే అవకాశం ఉంది.