పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. బడా నేతలంతా రాష్ట్రాల పర్యటలకు బయళ్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నారు. మార్చి 4వ తేదీన అదిలాబాద్, మార్చి 5వ తేదీన సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే ఈ పనులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. మోదీ పర్యటన కారణంగా మార్చి 4న జరగాల్సిన అమిత్ షా సభ రద్దైంది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని ప్రధాని జాతికి అంకితమిచ్చే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నట్టు సమాచారం. ఇక మార్చి రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో మోదీ టూర్ ఆసక్తికరంగా మారింది.
మోదీ పర్యటన షెడ్యూల్:
మార్చి 4న ఉదయం 9:20 గంటలకు నాగ్ పూర్
ఉదయం 10:30కు ఆదిలాబాద్ కు
11:10 గంటలకు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్