బీరు తయారీ పరిశ్రమ ట్యాంకులో ఉద్యోగి మూత్ర విసర్జన.. వీడియో వైరల్
ఈ బీర్ల కంపెనీకి ఆసియా వ్యాప్తంగా పేరుంది. అలా ఈ కంపెనీకి చెందిన ఓ వర్కర్ చేయకూడని పని చేశాడు. మూత్రం పోయడానికి ఎక్కడా చోటు లేనట్లుగా ఏకంగా బీర్లు నింపే ట్యాంకులో మూత్రం పోశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అసలు విషయం బయటపడింది. చైనాలోని కింగ్‌డావాలో సింగ్టావో అనే ప్రముఖ బీర్ల కంపెనీ లో ఆ ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీ.. చైనాలోనే అతి పెద్ద బీర్ల తయారీ కంపెనీల్లో రెండోది.
ఆ కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి.. కంపెనీలోని ట్యాంకులో యూరిన్ పోసినట్లు వీడియో ద్వారా తెలిసింది. హెల్మెట్, యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్‌లోకి మూత్ర విసర్జన చేసినట్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో బయటపడింది. సింగ్‌టావో బ్రూవరీ గోదాములో ఈ ఘటన జరిగింది. ఈ ఫుటేజ్ ఆన్‌లైన్‌లో మిలియన్ల మంది వీక్షించారు. ఇక, ఆ వైరల్ అయిన వీడియో కంపెనీ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది. మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీలు చేసింది.
A video clip showed someone urinating in the warehouse containing raw material for Tsingtao Beer went viral on Chinese social media. Regulators of Pingdu County, Qingdao, have started an investigation.
— CN Wire (@Sino_Market) October 20, 2023
A bearish news for Tsingtao Beer(SH600600).#China #Tsingtao pic.twitter.com/sani5QL2Vx
సోషల్ మీడియా వ్యాప్తంగా సింగ్టావో కంపెనీపై తీవ్ర విమర్శలు రావడంతో .. బీర్ల ట్యాంకులో వర్కర్ మూత్రం పోసిన ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనతో సింగ్టావో షేరు ధర పతనమైంది. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయని అవుట్‌లెట్ నివేదించింది. చైనా బీరు కంపెనీ బ్రాండ్ కు తీరని నష్టం జరిగిందని చైనా వాసులు చెప్పారు.