New Parliament Building : కొత్త పార్లమెంటు బిల్డింగులో కొలువుదీరిన లోక్సభ

Byline :  Kiran
Update: 2023-09-19 08:32 GMT

భారత దేశ చరిత్రలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొత్త పార్లమెంటు భవనంలో ఉభయ సభలు కొలువుదీరాయి. పాత బిల్డింగులోని సెంట్రల్ హాల్లో మోడీ చివరి ప్రసంగం అనంతరం లోక్సభ, రాజ్యసభ సభ్యులు కొత్త పార్లమెంటుకు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని నరేంద్రమోడీ ముందు నడవగా.. మిగతా సభ్యులు ఆయనను అనుసరించారు. సభ్యులంతా ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ కొత్త భవనంలో అడుగుపెట్టారు. పాత బిల్డింగు సెంట్రల్‌ హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని కొత్త భవనంలోకి తరలించారు. ఉభయ సభల సభ్యులు కొలువుదీరిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభలో అడుగుపెట్టారు.

జాతీయగీతాలాపన అనంతరం స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభించారు. కొత్త పార్లమెంటు భవనంలోని లోక్ సభ హాలులో కార్యక్రమాలు ప్రారంభించడం ప్రజాస్వామ్యంలో ఎన్నిటికీ మర్చిపోని రోజని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి చారిత్రాత్మక రోజుకు సాక్షిగా నిలవడం, పార్లమెంటు పాత, కొత్త భవనాల్లో సభా కార్యక్రమాల్లో పాల్గొనడం అందరి అదృష్టమని అన్నారు. సభలోని సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను ఓం బిర్లా గుర్తు చేశారు.




Tags:    

Similar News