Pune University : 'రామ్‌లీల' నాటకంలో రగడ.. 6 మంది అరెస్ట్

Update: 2024-02-05 12:48 GMT

హిందూ దేవతలైన రాముడు, సీత, లక్ష్మణులకు సంబంధించి పూణేలోని యూనివర్సిటీలో రామ్‌లీల అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో సీతమ్మ పొగతాగినట్లు నటించినందుకు, అసభ్య పదాలు మాట్లాడినందుకు అక్కడి విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రొఫెసర్‌తో సహా ఐదుగురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీలో చోటుచేసుకుంది. నాటకంలో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని విద్యార్థులు ఫిర్యాదులో తెలిపారు.




 


యూనివర్సిటీ క్యాంపస్‌లో శుక్రవారం ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలోని కొన్ని సీన్లలో అభ్యంతరకరమైన డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లలిత కళా కేంద్రానికి చెందిన విద్యార్థులతో గొడవ దిగారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. నాటకం సమయంలో సీతమ్మ సన్నివేషాలు వచ్చేటప్పుడు అక్కడ పోగతాగారు. అలాగే దుర్భాషతో మాట్లాడారు.




 


ఈ సందర్భంగా మతపరమైన భావాలను కించపరిచేలా ఉద్దేశపూర్వకంగా నాటకం ప్రదర్శించారని విద్యార్థి సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అంకుష్ చింతామన్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లలిత కళా కేంద్రం విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్ భోలేతో పాటుగా విద్యార్థులు భవేష్ పాటిల్, జే పెడ్నేకర్, ప్రథమేష్ సావంత్, రిషికేష్ దాల్వీ, యశ్ చిఖ్లేలను పోలీసులు అరెస్ట్ చేశారు.




 









Tags:    

Similar News