MLA Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బెదిరింపుల కేసులో పురోగతి

Update: 2024-01-21 02:51 GMT

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొంతకాలం ఎమ్మెల్యే‌కు విదేశాల నుంచి బెదిరింపు ఫోన్‌లు వస్తున్నాయి. ఈ విషయంమై ఆయన పలు మార్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కువైట్‌లో మకాం వేసిన మహమ్మద్ ఖాసీం ఈ పని చేసినట్లు గుర్తించారు. నిందితుడికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీవోఐపీ నెంబర్లను ఉపయోగించి కాల్ లోకేషన్స్ అధారంగా దర్యాప్తు చేపట్టారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. దీంతో కువైట్ నుండి కాల్స్ చేసినట్లు గుర్తించారు. 14 ఏళ్లుగా కువైట్ లో ఉంటున్న మహమ్మద్ ఖాసీమ్.. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా రాజాసింగ్‌ను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టకు చెందిన ఖాసీమ్‌గా గుర్తించారు. అంతకు ముందు అతను సౌదీ అరేబియాలో ఉన్నట్లు వివరాలు కనుగొన్నారు. నిర్ధారణ తర్వాత, పోలీసులు ఖాసిం పాస్‌పోర్ట్ వివరాలను సేకరించారు. దీంతో మమ్మద్ ఖాసిం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ఎల్ఓసి నీ జారీచేశారు. అతని పేరుపై అన్ని విమానాశ్రయాలు, సముద్ర ఓడరేవులు, సరిహద్దు చెక్‌పోస్టులకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. 




Tags:    

Similar News