Pune SI Suspended: పండుగ ముందే వచ్చిందని సంబరం.. వారంలోనే ఆనందం ఆవిరి

Update: 2023-10-19 03:17 GMT

ఆన్‌లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్‌ 11’ లో రూ.కోటిన్నర గెలుచుకున్న ఎస్‌.ఐ. సోమనాథ్‌.. మరోసారి వార్తల్లో నిలిచారు. లాటరీ గెలుచుకోవడంతో దసరాకు ముందే తమ ఇంట్లో పండుగ వాతావరణం వచ్చిందని చెప్పిన ఆయన సంతోషం వారం రోజుకు కూడా నిలువలేదు. ప్రభుత్వ అధికారి అయుండి ఇలాంటి గ్యాంబ్లింగ్‌ గేమ్‌లను ఆడినందుకు ఉన్నతాధికారులు సోమనాధ్ పై చర్యలు తీసుకొన్నారు. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్‌ మానే తెలిపారు.

మహారాష్ట్రలోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన( Somnath Zende) సోమ్​నాథ్​ జెండే... వారం రోజుల క్రితం డ్రీమ్ ​11(Dream11 One Crore Winner)లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. మూడు నెలలుగా​ డ్రీమ్​ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్టోబరు 10న విధుల్లో ఉండి.. ఇంగ్లాండ్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొన్నాడు. మ్యాచ్​లో ది బెస్ట్ గా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విషయం తెలిసి కుటుంబంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ఉన్నతాధికారుల చర్యతో ఆ ఆనందం ఆవిరైంది.

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్వప్నా గోర్.. సబ్-ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండే బెట్టింగ్ వ్యవహారంపై విచారణ జరిపారు. ఇక విచారణ పూర్తయ్యాక ఆయనను విధుల నుంచి సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్‌ మానే తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎస్‌ఐ సోమనాథ్ జెండేపై బిజెపి స్థానిక నాయకుడు అమోల్ థోరట్ నేరుగా హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యూటీ ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా యూనిఫాంలో డబ్బు సంపాదించి, అదే యూనిఫాంలో మీడియా ముందు కనిపించడం ద్వారా యువతను ఇలాంటి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేలా ప్రోత్సహించాడని థోరట్ ఆరోపించారు.

Tags:    

Similar News