వరద బాధితులకు సాయం చేస్తున్న మంత్రిని కాటేసిన పాము..

Update: 2023-08-19 15:53 GMT

హిమాచల్ ప్రదేశ్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. దీంతో నీటిని కిందికి విడుదల చేయడంతో పంజాబ్ లోని పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులకు సాయం చేసేందుకు వెళ్లిన ఆ రాష్ట్ర మంత్రిని విషసర్పం కాటేసింది. దీంతో ఆయన హాస్పిటల్ పాలయ్యారు.




 


పంజాబ్‌ విద్యా శాఖ మంత్రి హర్‌జోత్‌ సింగ్‌ బైన్స్‌ రూప్ నగర్ జిల్లాలోని ఆనంద్ పూర్ సాహిబ్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల బియాస్, సట్లెజ్ నదులు పొంగిపొర్లడంతో తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆగస్టు 15 రాత్రి సమయంలో హర్ జోత్ సింగ్ వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ విషసర్పం ఆయనను కాటేసింది.


 



పాటు కాటేసిన విషయం గుర్తించిన మంత్రి తన సిబ్బందికి చెప్పడంతో హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కు తరలించారు. సకాలంలో ట్రీట్ మెంట్ అందడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం విష ప్రభావం చాలా వరకు తగ్గిందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్పారు. ప్రజలకు సాయం చేయాలన్న తన సంకల్పాన్నీ ఏదీ అడ్డుకోలేదని, దేవుడు, ప్రజల ఆశీర్వాదంతోనే తాను బతకగలిగానని మంత్రి హర్ జోత్ సింగ్ చెప్పారు.




Tags:    

Similar News