కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తుండగా ఫ్లైట్ ను భోపాల్ లో అత్యవసరంగా దింపారు. బెంగళూరులో విపక్షాల భేటీ అనంతరం ఇద్దరు నేతలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ఫ్లైట్ ఢిల్లీకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో పైలెట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు భోపాల్ లో విమానం అత్యవసరంగా దింపేందుకు అనుమతించారు.
national,national news,rahul gandhi,sonia gandhi,bengaluru,delhi,flight,emergency landing,bhopal,opposition meet,madhya pradesh