Rahul Gandhi Ooty Visit: చిన్నారి ఆటోగ్రాఫ్ తీసుకున్న రాహుల్ గాంధీ

Update: 2023-08-28 08:15 GMT

భారత జోడో యాత్ర అంటూ రాహుల్ గాంధీ దేశం మొత్తం చుట్టేస్తున్నారు. ఇంతకు ముందులా అదే పనిగా తిరగకపోయినా....టైమ్ దొరికినప్పుడల్లా ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా తన నియోజకవర్గం వాయనాడ్ వెళుతూ...మధ్యలో ఊటీలో ఆగారు. అక్కడా చాక్లెట్లు కూడా తయారు చేశారు.

వాయనాడ్ వెళుతూ మధ్యలో ఊటీలో ఆగారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. అక్కడ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అక్కడ అందరూ మహిళలే పని చేస్తున్నారంటూ...చకచకా చాక్లెట్లు తయారు చేస్తున్నారంటూ ఆశ్చర్యపోయారు ఆయన. అక్కడ వారితో చాలా సేపు మాట్లాడారు. చాక్లెట్లు ఎలా తయారు చేయాలో అడిగి తెలుసుకున్నారు. ఆ మహిళలతో పాటూ తాను చాక్లెట్లు తయారు చేశారు.

అప్పుడే అక్కడ ఒ చిన్న పిల్ల రాహుల్ గాంధీని ఆటోగ్రాఫ్ ఇవ్వమంటూ పుస్తకం, పెన్ పట్టుకుని వచ్చింది. ఆమెకు ఆటోగ్రాఫ్ ఇచ్చిన తరువాత నాకో చిన్న సహాయం చేస్తావా అని ఆ అమ్మాయిని అడిగారు. దానికి ఆ చిన్నారి నవ్వుతూ తల ఊపింది. అప్పుడు రాహుల్ ఆ చిన్నారిని తన బుక్, పెన్ అడిగారు. అవి ఇస్తే...వాటిని ఆ పాపకు ఇచ్చి నీ ఆటోగ్రాఫ్ ఇస్తావా అని అడిగారు. ఆ పాప కూడా ఆనందంగా తన పేరును రాసిచ్చింది. ఆ పేపర్ ను రాహుల్ గాంధీ పుస్తకం నుంచి వేరు చేసి తన జేబులో పెట్టుకున్నారు.

ఈ మొత్తం వీడియోను కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతా(ట్విట్టర్) లో పోస్ట్ చేసింది. దీనికి బోలెడన్ని లైకులు వస్తున్నాయి. సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రాహుల్ గాంధీ అక్కడ చాక్లెట్లను టేస్ట్ చేశారు. వారు ఇచ్చిన కాఫీని తాగారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఎంఎస్ఎంఈ లు ట్యాక్స్ లు, 18 శాతం జీఎస్టీలతో ఎదగలేకపోతున్నామని చెప్పారు. దీనినే కాంగ్రెస్ క్యాప్షన్ కింద రాస్తూ ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేసింది.

Tags:    

Similar News