Rahul Gandhi Bike Ride : స్పోర్ట్స్ బైక్పై రాహుల్ గాంధీ లద్దాఖ్ టూర్

Update: 2023-08-19 11:45 GMT

లద్దాఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్టైలిష్ లుక్లో అదరగొట్టారు. టూర్లో భాగంగా పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్ చేపట్టారు. ఆగష్టు 20న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని అక్కడే నిర్వహించనున్నారు. బైక్‌ రైడ్‌కు సంబంధించిన ఫొటోలను రాహుల్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి.

ఇటీవలే KTM 390 అడ్వెంచర్ బైక్‌ కొనుగోలు చేశారు. అయితే సెక్యూరిటీ రీజన్స్ వల్ల రైడ్ చేయలేకపోయారు. ప్రస్తుతం ఆ KTM బైక్‌పైనే ఆయన పాంగాంగ్ సరస్సు వరకు వెళ్లనున్నారు. ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటని తన తండ్రి రాజీవ్‌ గాంధీ చెప్పేవారని రాహుల్ గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ అడ్వెంచర్ టూర్ కు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ ట్విటర్‌ లో షేర్ చేసింది.


'Upwards And Onwards - Unstoppable!' అంటూ కాంగ్రెస్ చేసిన ట్వీట్​ వైరల్ గా మారింది. రాహుల్ స్టైలిష్ లుక్​ చూసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నెటిజన్లు.. సూపర్గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రాహుల్ రేసర్​లా కనిపిస్తున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ గురువారం లేహ్ పర్యటనకు వెళ్లారు. తాజాగా తన టూర్ ను ఆగస్టు 25 వరకు పొడగించుకున్నారు. శుక్రవారం ఆయన లేహ్‌లోని యువతతో కాసేపు సరదాగా మాట్లాడారు.



Tags:    

Similar News