Rahul Gandhi Case : రాహుల్ గాంధీ కేసు సీఐడీకి బదిలీ

Byline :  Krishna
Update: 2024-01-25 05:56 GMT

అసోంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం పాదయాత్రలో ఘర్షణ చోటుచేసుకోవడంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. యాత్రకు ఇచ్చిన నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేస్తూ అక్కడి పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ కేసు విచారణ కోసం సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

కాగా రాహుల్ గాంధీ సహా మిగితా వారిపై సుమోటోగా కేసు నమోదు చేశామని రెండు రోజుల క్రితం గువాహటి సీపీ దిగంత బోరా తెలిపారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొనేవారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా.. పర్మిషన్ ఉన్న మార్గంలోనే వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వివరించారు. అయినా యాత్రలో పాల్గొన్న వారు నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బారికేడ్లను తోసుకొని ముందుకెళ్లాలని నాయకులే ప్రోత్సహించడంతో కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని చెప్పారు. ఈ దాడిలో నలుగురు సిబ్బందికి గాయాలైనట్లు తెలిపారు.

Tags:    

Similar News