Rahul Gandhi Contesting : ఎక్కడ ఓడారో అక్కడ నుంచే మళ్ళీ పోటీ

Update: 2023-08-18 14:13 GMT

ఎన్నికల టైమ్ దగ్గర పడుతోంది. నెమ్మదిగా పార్టీలు తమ అభ్యర్ధుల లిస్ట్ లను ప్రకటిస్తున్నారు. అలాగే ఎవరెవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయాలను కన్ఫార్మ చేస్తున్నారు. కాంగ్రెస్ టాప్ లీడర్ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ అమేధీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఎక్కడ పోగొట్టుకున్నమో అక్కడే వెతుక్కోవాలి అని పెద్దలు చెబుతారు. దీన్నే రాహుల్ గాంధీ తూచ తప్పకుండా పటిస్తున్నారు. తాను పోగొట్టుకున్న చోటనే మళ్ళీ పోటీచేసి గెలవాలని ఆయన అనుకుంటున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. క్రితం సారి ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. ఒకటి ఉత్తర ప్రదేశ్ లోని అమేధీ నుంచి అయితే రెండోది కేరళలోని వాయనాడ్ నుంచి. అమేధీలోని స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. వాయనాడ్ నుంచి గెలిచి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. అయితే లాస్ట్ ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడాన్ని రాహుల్ సీరియస్ గా తీసుకున్నారుట. అందుకే ఈసారి అక్కడి నుంచే మళ్ళీ పోటీ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ మంచి పేరును తెచ్చుకున్నారు. మోదీ ఇంటి పేరు మీద చేసిన వ్యాఖ్యల్లో తన పార్లమెంట్ సభ్యత్వాన్ని పోగొట్టుకుని ఇటీవలే దాన్ని మళ్ళీ తిరిగి పొందారు. మొన్న పార్లమెంటులో గవర్నమెంటు మీద వేసిన అవిశ్వాస తీర్మానంలోనూ రాహుల్ చాలా బాగా మాట్లాడారని పేరు తెచ్చుకున్నారు. అలాగే ఎన్నికలలో లోపు మరోసారి భారత్ జోడో యాత్రను చేయాలని ఆయన అనుకుంటున్నారు.

rahul gandhi deciided to contest from amedhi again, says congress. congress, to leader, rahul gandhi, elections, contest, uttarpradesh, amedhi, kerala, waynad, smrithi irani

Tags:    

Similar News