ఆడబిడ్డల కన్నీళ్లకంటే.. రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా: మోదీపై ఫైర్

Byline :  Bharath
Update: 2023-12-31 11:42 GMT

భారత రెజ్లర్లకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. రెజ్లర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. యావత్ దేశానికి సంరక్షకుడైన మోదీ.. ఉదాసీనత చూస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు. దేశంలోని ప్రతీ మహిళకు ఆత్మ గౌరవమే తొలి ప్రాధాన్యమని చెప్పారు. ఆ తర్వాతే పతకాలు, గౌరవం, ప్రశంసలు అని అన్నారు. రెజ్లర్ల కన్నీటికంటే.. మోదీకి రాజకీయ ప్రయోజనాలు ఎక్కువయ్యాయా? అని ప్రశ్నించారు. ఇకనైనా రెజ్లర్ల విషయంలో యాక్షన్ తీసుకుని వారికి న్యాయం చేయాలని ప్రధాని మోదీకి సూచించారు.

కాగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫొగాట్‌ తనకు వచ్చిన జాతీయ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజగా ఆమె ఆ అవార్డులను తిరిగి ఇచ్చేసింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై శనివారం తన అర్జున, ఖేల్ రత్న అవార్డులను వినేశ్‌ ఫొగాట్‌ వదిలిపెట్టింది. అయితే తొలుత ఆమె ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించింది. కానీ కర్తవ్య పథ్ వద్ద ఫొగాట్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన అవార్డులను కర్తవ్య పథ్ వద్ద పేవ్‌మెంట్‌పై వదిలి వెళ్లిపోయింది. అనంతరం ఆ పతకాలను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News