బీజేపీలో ఉన్న ఎంపీ.. ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉన్నడు: రాహుల్ గాంధీ

By :  Kalyan
Update: 2023-12-28 13:55 GMT

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై ఫైర్ అయ్యారు. బీజేపీలో గులాంగిరీ నడుస్తుందని, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీజేపీ ఎంపీ ఒకరు తనతో చెప్పారని రాహుల్ అన్నారు. బీజేపీలో ఉన్న ఆ ఎంపీ.. ఇప్పటికీ కాంగ్రెస్తోనే ఉన్నడని రాహుల్ గాంధీ చెప్పారు. నాగ్ పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన రాహుల్.. బీజేపీలో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలు పాటించాలని, కార్యకర్తల గోడును వినే వారుండరని ఆ ఎంపీ చెప్పాడన్నారు. బీజేపీలో హైకమాండ్ ఇచ్చిన సూచనలు తమకు నచ్చినా, నచ్చకపోయినా మరో అవకాశం ఉండదని ఆ ఎంపీ చెప్పినట్లు వివరించారు.

ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒత్తిళ్లతో పనిచేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినం సందర్భంగా.. లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించారాయన.




Tags:    

Similar News