Adani report : ఆ నివేదిక.. దేశ ప్రతిష్టను దిగజారుస్తోంది: రాహుల్ గాంధీ
గౌతమ్ అదానీ, ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అదానీ అక్రమాలకు పాల్పడుతుంటే వాటిని ప్రధాని అండగా ఉన్నారని ఫైర్ అయ్యారు. భారత్ అదానీ గ్రూప్ చేసిన అక్రమాలను ఓ అంతర్జాతీయ మీడియా బయటపెట్టినా.. ప్రధానమంత్రి ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు. occr నివేదిక అదానీ అక్రమాలు సాక్ష్యమని చప్పిన రాహుల్.. ఆ సంస్థలో నాసర్ అలీ, చాంగ్ చుంగ్ లీ పెట్టుబడులు పెట్టారని చెప్పుకొచ్చారు.
అదానీ స్కాంలో వినోద్ అదానీ పాత్ర స్పష్టంగా బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. అయినా అతనికి సెబీ క్లీన్ చిట్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని రాహుల్ ఎద్దేవా చేశారు. షెల్ కంపెనీల నుంచి అదానీ సంస్థలో పెట్టుబడులు వస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై జేపీసీ ఎందుకు వేయలేదని రాహుల్ ప్రశ్నించారు. occr నివేదిక ఇవ్వడం దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. బిలియన్ డాలర్ల ధనం భారత్ నుంచి వెళ్లి వివిధ మార్గాల్లో తిరిగి మళ్లీ భారత్ కు వస్తుందని ఆరోపించారు. ఆ డబ్బు అదానీకా.. లేక బీజేపీ పార్టీ తీసుకుంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు.