Rahul Gandhi On China :చైనా ఆక్రమణతో మన పశువులకు మేత లేకుండా పోతోంది: రాహుల్ గాంధీ

Update: 2023-08-20 11:04 GMT

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత భూముల్లో ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఆక్రమిండచలేదని చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు రాహుల్. మన భూభాగంలోకి చైనా ఆర్మీ ప్రవేశించింది అని అక్కడి ప్రజలు చెప్తున్నా మోదీ స్పందించడం లేదని విమర్శించారు. లద్దాక్ లోని లేహ్ లో పర్యటిస్తూ బైక్ యాత్ర చేస్తున్న రాహుల్.. భారత్-చైనా సరిహద్దులోని పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

‘చైనా మన భూభాగాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని మోదీ చెప్తున్న మాటలు అవాస్తవం. కానీ అక్కడి ప్రజలకు తెలుసు అక్కడ అసలేం జరుగుతుందో. ఇదివరకు పశువులను మేతకు తీసుకెళ్లిన ప్రదేశాల్లో చైనా ఆర్మీ ఉందని, అక్కడిని వెళ్లలేకపోతున్నట్లు చెప్తున్నారు. వీరి మాటల్లో నిజం తెలుస్తోంది. లద్దాఖ్ లో ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. ఈ విషయాన్ని ప్రధాని, రక్షణ మంత్రి పట్టించుకోలేకపోతే దేశానికి అన్యాయం చేసినట్లే. ఆర్టికల్ 370 రద్దు చేసి, ప్రత్యేక హోదా కల్పించినా అక్కడి వాళ్లు సంతోషంగా లేరు. దీనిపై స్థానికుల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. అక్కడి ప్రజలు మరింత ప్రాతినిథ్యం కావాలని కోరుకుంటున్నార’ని రాహుల్ అన్నారు.



Tags:    

Similar News