ప్రధాని మోదీ కులంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు : Rahul Gandhi
ప్రధాని నరేంద్ర మోదీ కులంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. మోదీ ఓబీసీ కాదని, అందుకే ఆయన కులగణనకు వ్యతిరేకమని రాహుల్ ఆరోపించారు. భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడలో సాగుతున్న భారత్ న్యాయ్ యాత్రలో భాగంగా.. ప్రసంగించిన రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ఓబీసీ క్యాటగిరీలో పుట్టలేదని, గుజరాత్ లోని తేలి కులంలో పుట్టారని అన్నారు. 2000లో తేలి కులాన్ని బీజేపీ ఓబీసీ క్యాటగిలో చేర్చిందని చెప్పుకొచ్చారు. మోదీ ఓబీసీ వర్గానికి చెందిన వారు కాదన్నారు.
మోదీ గుజరాత్ లో సాధారణ కులంలోనే జన్మించారు. స్వతహాగా ఆయన ఓబీసీ కాదని అన్నారు. ఓబీసీలో జన్మించనందుకే ఆయన తన జీవితాంతం కులగణన నిర్వహించడానికి ఒప్పుకోరని విమర్శించారు. మోదీ ఓబీసీని కలవరు. చేయి పట్టుకోరని రాహుల్ ఆరోపించారు. కేవలం అదానీ చేయి మాత్రమే పట్టుకుంటారు. ఇదే అందుకు నిదర్శనమని రాహుల్ విమర్శలు గుప్పించారు. కాగా రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఒడిషాలోకి ప్రవేశించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత.. రాహుల్ తొలిసారి చత్తీస్ ఘడ్ లో అడుగుపెట్టారు.