లోక్‌సభ వేదికగా కేంద్ర సర్కార్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారని మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. మీరంతా దేశద్రోహలు అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో రాహుల్ మాట్లాడారు. పాదయాత్రలో భాగంగా కొన్ని రోజుల క్రితమే తాను మణిపూర్‌కు వెళ్లానని రాహులు తెలిపారు. కానీ ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఆ రాష్ట్రానికి వెళ్లలేదని, మణిపూర్ మన దేశంలో లేదని ఆయన భావిస్తున్నారని విమర్శించారు.
లోక్‌సభలో రాహుల్ మాట్లాడుతూ..."గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు సీనియర్ నేతకు కొంచెం బాధ కలిగి ఉంటుంది. నేను అప్పుడు నిజం మాత్రమే మాట్లాడాను. కానీ ఇవాళ నా ప్రసంగం విని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇవాళ అదానీ గురించి మాట్లాడను. మీరు ప్రశాంతంగా ఉండవచ్చు. నేను ఇవాళ మనసుతో మాట్లాడుతున్నాను. నేను ఇవాళ మీపై దాడి చేయను, ఒకట్రెండు సూటి ప్రశ్నలు మాత్రమే వేస్తాను. గత ఏడాది నేను 130 రోజుల పాటు దేశంలో ఒక మూల నుంచి మరో మూలకు నడిచాను. నేను ఒక్కడినే కాదు, నాతో పాటు మరికొంత మంది కలిసి నడిచారు. కన్యా కుమారి నంచి కశ్మీర్ వరకు నడిచాను. ఈ క్రమంలో ఎందుకు నడుస్తున్నావు? నీ లక్ష్యం ఏమిటని నన్ను చాలా మంది అడిగారు. ప్రారంభంలో నాకు నోట మాట రాలేదు.
దేని కోసమైతే నేను పదేళ్లు మాటలు పడ్డానో అది తెలుసుకోవాలనుకున్నాను. ఏళ్లుగా నేను రోజు 8 నుంచి 10 కి.మీ.లు పరిగెత్తుతున్నాను. ఎందుకు నడుస్తున్నానో క్రమంగా నాకు అర్థమైంది. 10కి.మీ.లు పరిగెత్తే నాకు 25 కి.మీ.లు నడవటం పెద్ద విషయం కాదనుకున్నాను. అప్పట్లో నాలో అహంకారం కూడా ఉండేది. కానీ నడిచినప్పడు మోకాలి నొప్పి మొదలైంది. అహంకారంతో దేశాన్ని చూడాలనుకున్నాను. నడవలేను అని నేను అనుకున్నప్పుడల్లా ఏదో శక్తి నన్ను వెన్నంటి నడిపించేది. ఒక రోజు ఒక చిన్న పాప వచ్చి నాతో కలిసి నడుస్తాను అని చెప్పింది. ఒక రైతు నాతో మాట్లాడిన తరువాత నా ఆలోచనా ధోరణ మారింది. నాతో మాట్లాడే వారి మాటలు మాత్రమే నాకు వినిపించసాగాయి. మన ఆలోచనలు పక్కన పెడితేనే జనం బాధ అర్థం చేసుకోగలం. అహంకారం, ద్వేషాన్ని పక్కన పెడితేనే భారత్ మాట వినగలం.
నేను మణిపూర్ వెళ్లాను. కానీ మన దేశ ప్రధాని మోదీ ఇంత వరకు అక్కడికి వెళ్లలేదు. మోదీ దృష్టిలో మణిపూర్ భారత్‌లో భాగం కాదు. మీరు మణిపూర్‌ను రెండుగా విభజించారు.
నేను మణిపూర్‌లో సహాయ శిబిరాలకు వెళ్లి అక్కడి మహిళలు, పిల్లలతో మాట్లాడాను.కానీ ప్రధాని ఇంత వరకు అక్కడికి వెళ్లలేదు. నా కళ్ల ముందే నా కొడుకుని కాల్చి చంపారని ఓ మహిళ చెప్పింది. రాత్రంతా నేను ఆ శవంతోనే ఉన్నానని కన్నీటి పర్యంతమైంది. కానీ భయం వేసి అన్ని వదిలేసి బయటకు వచ్చానని చెప్పింది. నా కళ్ల ముందే ఆమె వణికిపోతూ స్పృహ కోల్పోయింది. మీరు మణిపూర్‌లో భరతమాతను హత్య చేశారు. మీరు దేశద్రోహాలు" అంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Congress MP Rahul Gandhi says, "Bharat ek awaaz hai, Bharat hamari janta ki awaaz hai, dil ki awaaz hai. Uss awaaz ki hatya aapne Manipur mein ki. Iska matlab Bharat Mata ki hatya aapne Manipur mein ki...You killed India by killing the people of Manipur. You are a… pic.twitter.com/eroj209SKY
— ANI (@ANI) August 9, 2023