Odisha train accident: మోదీ.. రైల్వేమంత్రితో వెంటనే రాజీనామా చేయించాలి: రాహుల్ గాంధీ
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంతో దేశం ఉలిక్కిపడింది. ఈ యాక్సిడెంట్ లో 275 మంది చనిపోగా.. 11వేల మందికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర విచారణ వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. రైలు ప్రమాదానికి మోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అసమర్థుల వల్ల అమాయకులు బలవుతున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ట్విట్టర్ లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
‘270 మందికి పైగా ప్రయాణికులు చనిపోయినా ఇప్పటివరకు కేంద్ర సర్కార్ జవాబుదారీగా వ్యవహరించడం లేదు. ఈ ఘోర దుర్ఘటనకు బాధ్యత వహించకుండా మోదీ ప్రభుత్వం తప్పించుకోలేదు. ఫలితం అనుభవిస్తారు. ప్రధాని మోదీ వెంటనే రైల్వేశాఖ మంత్రితో రాజీనామా చేయించాలి’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
270+ मौतों के बाद भी कोई जवाबदेही नहीं!
— Rahul Gandhi (@RahulGandhi) June 4, 2023
मोदी सरकार इतनी दर्दनाक दुर्घटना की ज़िम्मेदारी लेने से भाग नहीं सकती।
प्रधानमंत्री को फ़ौरन रेल मंत्री का इस्तीफा लेना चाहिए!