3 రాష్ట్రాల్లో హోరాహెరి పోటీ..ప్రముఖుల ఫలితాలు ఇలా

Byline :  Aruna
Update: 2023-12-03 05:43 GMT

దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎన్నికల ఫలితాల కొసం ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‎గఢ్ రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. కట్టుదిట్టమైన సెక్యూరిటీ నడుమ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తోంది. మరి ఈ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల పరిస్థితితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సరళిని ఇప్పుడు తెలుసుకుందాం.

బుద్నీలో వెనుకంజలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ :

మధ్యప్రదేశ్‎లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. 2018 ఎలక్షన్లలో హంగ్​ రావడంతో హైఓల్టేజ్​ రాజకీయాలు దర్శనమిచ్చాయి.ఈ క్రమంలో 2023 ఎలక్షన్లలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. ఇందులో మేజిక్​ ఫిగర్​ 116 సీట్లు సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అయితే కౌంటింగ్‎లో బుద్నీ నుంచి పోటీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు. ఇక ఛింద్వాఢా నుంచి పోటీ చేసిన రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ క్యాండిడేట్ కమల్‎నాథ్ కూడా వెనుకంజలో ఉన్నారు.

రాజస్థాన్‎లో బీజేపీ-కాంగ్రెస్​ మధ్య టఫ్ ఫైట్ :

రాజస్థాన్​లోనూ కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. బీజేపీ- కాంగ్రెస్​ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. జోత్వాఢా నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ వెనుకంజలో ఉన్నారు. సర్దార్‎పుర నుంచి పోటీ చేసిన సీఎం అశోక్ గహ్లోత్ ముందంజలో ఉన్నారు. ఇక టోంక్ నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ వెనుకంజలో ఉన్నారు. మరో వైపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,బీజేపీ క్యాండిడేట్ వసుంధరా రాజే ఝల్రాపటన్ లో ఆధిక్యంలో ఉన్నారు. రాజస్థాన్​లో మొత్తం 200 సీట్లు ఉన్నాయి. ఇందులో 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే మేజిక్ ఫిగర్​ 100 దాటాల్సిందే.

ఛత్తీస్​గఢ్​లో పరిస్థితి ఇలా :

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే ఆయా పార్టీలు మేజిక్​ ఫిగర్​ 46 దాటాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్​ అధికారంలో ఉంది. ఇక రాజనంద్‎గావ్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం రమణ్ సింగ్ వెనుకంజలో ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే మిజోరం ఎలక్షన్ రిజల్ట్ కూడా ఇవాళే రావాల్సి ఉంది. కానీ కౌంటింగ్ ప్రక్రియను సోమవారానికి పోస్ట్‎పోన్ చేశారు. 

Tags:    

Similar News