Rajinikanth Meets Yogi : యూపీ సీఎం యోగిని కలవనున్న రజినీ కాంత్.. ఆయనతో కలిసి..
రజనీకాంత్ జైలర్ థియేటర్స్లో జైత్రయాత్ర సాగిస్తోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ను బద్ధలుకొడుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 450 కోట్ల వసూళ్ళతో దూసుకుపోతోంది. రజనీకాంత్ మార్క్ స్టైల్, యాక్షన్‌తో పాటు మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్..శాండిల్ వుడ్ సంచలనం శివరాజ్ కుమార్ కనిపిస్తే ఎలా ఉంటుందో..? 'జైలర్' రుచి చూపించింది.
ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రజినీ కలవనున్నారు. ఆయనతో కలిసి ‘జైలర్’ మూవీని వీక్షించనున్నారు. దీనికోసం ఇప్పటికే రజినీ లక్నో చేరుకున్నారు. దేవుడి దయ వల్ల సినిమా విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని సూపర్ స్టార్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రితో కలిసి జైలర్ చూస్తానని చెప్పారు. సినిమా విడుదల సమయంలో రజినీ హిమాలయాలకు వెళ్లారు. ఇటీవలే ఆయన తిరిగొచ్చారు.
కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ,మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్, తమన్నా, సునీల్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పక తప్పదు. ప్రధానంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు కెవ్వు కేక అనిపించాయి. దీంతో రజనీ ఫ్యాన్స్ ఈ సినిమాతో పండగ చేసుకుంటున్నారు.