రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్

Byline :  Kiran
Update: 2024-01-01 13:58 GMT

రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారైంది. జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయం ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ప్రతిష్టాపన అనంతరం హారతి ఇస్తారని, సూర్యాస్తమయం తర్వాత దీపాలు వెలిగించాలని చెప్పారు.

రామ్ లల్లా విగ్రహం కర్టెన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ తొలిగించనున్నారు. అనంతరం రామయ్యకు కాటుక దిద్ది.. విగ్రహానికి బంగారు వస్త్రాలు ధరింపజేయనున్నారు. అనంతరం పూజ నిర్వహించి.. 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ప్రాణ ప్రతిష్టకు ముందుగా బాల రామయ్య విగ్రహాన్ని నగర పర్యటనకు తీసుకుని వెళ్లనున్నారు.

Tags:    

Similar News