Ayodhya Ram Mandir : అయోధ్య వేడుక..హైదరాబాద్‌లో హైఅలర్ట్

Update: 2024-01-22 03:15 GMT

అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు భాగ్యనగరంలో సున్నితమైన అన్ని ప్రాంతల్లో పోలీసులు అలర్ట్‌గా ఉండాలని డీజీపీ రవిగుప్తా తెలిపారు. పక్కాగా బందోబస్తు ప్లాన్ చేయాలనీ ఉన్నతాధికారులకు ఆదేశించారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రజల కదలికలను పోలీసులు నిశితంగా పరిశీస్తున్నారు. పాతబస్తీ ఏరియాలో నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పటు చేశారు. మరోవైపు ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురిలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.

జైషే హెచ్చరికతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేసింది. రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడిన వేళ అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు అయోధ్యలో కేంద్ర బలగాలతో పాటు భారీగా యూపీ భద్రతా బలగాలు మోహరించాయి. రామ సేవక్ పురంతో పాటు చాలా ప్రాంతాలు ATS కమాండోల నిఘా పరిధిలోకి వెళ్లాయి

Tags:    

Similar News