ప్రజాపంపిణీ కోసమే రేషన్ కార్డు..ఢిల్లీ హైకోర్టు కీలక ప్రకటన

Byline :  Shabarish
Update: 2024-03-07 13:40 GMT

రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదని, అది ప్రజాపంపిణీ కోసమే ఏర్పాటు చేసిందని ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. రేషన్ కార్డును అడ్రస్ లేదా నివాసానికి సంబంధించిన రుజువుగానే పరిగణించలేమని స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందడానికి ప్రత్యేకంగా రేషన్ కార్డును జారీ చేస్తారని తెలిపింది. కాబట్టి రేషన్ కార్డును ప్రూఫ్‌గానే చూడలేమని కోర్టు వెల్లడించింది.

ఢిల్లీలోని కాత్పుత్తీ కాలనీకి సంబంధించిన కేసును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి చంద్రధారి సింగ్ నేడు విచారించారు. ఆ కాలనీని అభివృద్ధి చేసిన తర్వాత పునరావాస పథకం కింద ప్రత్యామ్నాయ వసతిని కల్పించాలని అక్కడి ప్రజలు కోరారు. అందుకోసం వారంతా పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరిగా ధృవీకరణ పత్రంగా రేషన్ కార్డు ఉండాలని అధికారులు నోటీసుల్లో తెలిపారు. దానిని హైకోర్టు తప్పుబట్టింది. ఆ నిర్ణయం ఏకపక్షం అని, చట్టవిరుద్ధమని తెలిపింది.



Tags:    

Similar News