జులై నెలలో బ్యాంక్‌లకు 15 రోజులు సెలవులు.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదిగో

Update: 2023-06-26 12:24 GMT

ఆర్బీఐ.. బ్యాంక్‌ కస్టమర్ల అవసరాల కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగానే ప్రకటిస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవులు ఈ లిస్ట్ లో ఉంటాయి. జులై నెలకు సంబంధించిన హాలిడేస్ లిస్ట్ ను కూడా ఆర్బీఐ విడుదల చేసింది. జులై నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజుల సెలవులు ఉన్నాయి. జులై నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు చూద్దాం..

జూలై 2023 నెల బ్యాంకుల సెలవుల లిస్ట్:

జూలై 2వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 5వ తేది గురు హరగోవింద్ సింగ్ జయంతి (జమ్మూ, శ్రీనగర్‌లలో బ్యాంకులకు సెలవు)

జూలై 6వ తేది- మిజోరాం మహిళల ఇన్సుయ్‌ఖౌమ్ పాల్ దినోత్సవం (మిజోరంలో బ్యాంకులకు సెలవు)

జూలై 8వ తేది- రెండవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 9వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 11వ తేది- కేర్ పూజ (త్రిపురలో బ్యాంకులకు సెలవు)

జూలై 13వ తేది- భాను జయంతి (సిక్కింలో బ్యాంకులకు సెలవు)

జూలై 16వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 17వ తేది- యు టిరోట్ సింగ్ డే (మేఘాలయలో బ్యాంకులకు సెలవు)

జూలై 21వ తేది- ద్రుక్పా త్షే-జి (సిక్కింలో బ్యాంకులకు సెలవు)

జూలై 22వ తేది- నాలుగవ శనివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 23వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 28వ తేది- అషూరా (జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు)

జూలై 29వ తేది- ముహర్రం (తజియా) కారణంగా బ్యాంకులకు సెలవు

జూలై 30వ తేది- ఆదివారం కారణంగా బ్యాంకులకు సెలవు




Tags:    

Similar News