RBI : 2వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన..

Byline :  Krishna
Update: 2023-10-06 17:15 GMT

రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 30తో నోట్ల మార్పిడి గడువు ముగియగా.. ఆర్బీఐ ఈ నెల 7 వరకు పొడిగించింది. ఈ టైం కూడా ముగుస్తుండడంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువు ముగిసిన తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గుర్తుచేశారు.

RBIమే 19న ఆర్బీఐ 2వేల నోటును రద్దు చేసింది. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వరకు గడువు ఇచ్చింది. రూ.2 వేల నోట్ల రద్దు చేసే సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. అందులో రూ.3.43 లక్షల కోట్లు ఇప్పటి వరకు వెనక్కి వచ్చినట్లు చెప్పారు. వాటిలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే వచ్చాయని తెలిపారు. కాగా ఎవరైనా ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించలేని వాళ్లు తపాలా శాఖ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు.




Tags:    

Similar News