Bank Holiday: నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు

By :  Bharath
Update: 2023-10-29 16:43 GMT

ఆర్బీఐ.. బ్యాంక్‌ కస్టమర్ల అవసరాల కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను ముందుగానే ప్రకటిస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవులు ఈ లిస్ట్ లో ఉంటాయి. నవంబర్‌ నెలకు సంబంధించిన హాలిడేస్ లిస్ట్ ను కూడా ఆర్బీఐ ముందుగానే విడుదల చేసింది. నవంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 15 రోజుల సెలవులు ఉన్నాయి. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి మొత్తం 15 రోజుల సెలవులు నవంబర్‌ నెలలో రాబోతున్నాయి. కాగా నవంబర్ లో ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు చూద్దాం..

నవంబర్‌ 2023 నెల బ్యాంకుల సెలవుల లిస్ట్:

• నవంబర్‌ 1వ తేది- మంగళవారం కన్నడ రాజ్యోత్సవం, కుట్, కర్వా చౌత్ సందర్భంగా కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

• నవంబర్‌ 10వ తేది- అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నో నగరాల్లో వంగ్లాలా పండుగ సంర్భంగా సెలవు.

• నవంబర్‌ 11 నుంచి 14 వ తేది మధ్య నాలుగు రోజులు వరుస సెలవులు

• నవంబర్‌ 11 రెండో శనివారం, 12న ఆదివారం కారణంగా సెలవు.

• 13, 14వ తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా సెలవు

• నవంబర్‌ 15వ తేది- బాయ్ దోజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ సందర్భంగా సెలవు

• నవంబర్‌ 20వ తేది- చాత్ పూజ సందర్భంగా బీహార్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు

• నవంబర్‌ 23వ తేది- సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగల కారణంగా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో సెలవు

• నవంబర్‌ 27వ తేది- గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా సెలవు

• నవంబర్‌ 30వ తేది- కనక దాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు

Tags:    

Similar News