Reserve Bank Of India: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. లేటైతే రూ.100 జరిమానా

By :  Bharath
Update: 2023-10-28 15:28 GMT

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న నిబంధనల్లో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆ నిబంధనల ప్రకారం.. వినియోగదారుడు ఒక కంప్లైంట్ చేస్తే, దాన్ని ఆ రోజు నుంచి 30 రోజుల వ్యవధిలో పరిష్కరించాలి. అలా చేయనట్లయితే 31వ రోజు నుంచి సదరు బ్యాంకు వినియోగదారుడికి రోజుకు రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్ ఇన్‌స్టిట్యూషన్ అప్‌డేట్ చేసిన సమాచారాన్ని 21 రోజులలోపు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ సమర్పించాలి. అలా చేసినప్పటికీ, ఫిర్యాదు 30 రోజులలోపు పరిష్కారం కాకుంటే ఫిర్యాదుదారుకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ పరిహారం మొత్తం కంప్లైంట్ చేసిన వ్యక్తి బ్యాంక్ ఖాతాలో 5 వర్కింగ్ డేల్లో జమ అవుతుంది. క్రెడిట్ సంస్థలు లేదా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు పరిహారం అందించకపోతే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్, 2021 కింద ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను వినియోగదారుడు సంప్రదించవచ్చు.

Tags:    

Similar News