ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై..బీజేపీలో రీజాయిన్

Byline :  Vamshi
Update: 2024-03-20 07:48 GMT

తెలంగాణ మాజీ గవర్నర్ తమిసై సౌందరరాజన్ తిరిగి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తమిసై మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచనతోనే తాను ప్రత్యక్షరాజకీయాల్లోకి వస్తున్నట్లు వెల్లడించారు. సెంట్రల్ చెన్త్నె నుంచి బీజేపీ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు.

2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమెను కేంద్రం తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. 2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలు అంటే మక్కువతో లోక్‌సభ ఎన్నికలకు ముందు గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి బీజేపీలో చేరారు

Tags:    

Similar News