Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం దగ్గర రెచ్చిపోయిన దొంగలు

Byline :  Bharath
Update: 2024-01-23 14:34 GMT

అయోధ్య రామమందిరంలో బాల రాముని ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. హిందువుల దశాబ్దాల కల నెరవేరింది. ప్రారంభోత్సవం రోజున కేవలం వీఐపీలకు అనుమతి ఉండగా.. సాధారణ పౌరులకు ఇవాళ్టినుంచి (జనవరి 23) రామ్ లల్లా దర్శనానికిక అనుమతిస్తున్నారు. కాగా నిన్నిటి కార్యక్రమం చూసేందుకు భారీ ఎత్తున రామ భక్తులు అక్కడికి చేరుకోగా.. వారిని ఆలయంలోనికి అనుమతించలేదు. దీంతో స్థానికంగా ఉన్న హోటళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రోడ్లపై రాత్రి బస చేశారు. చాలామంది ఇవాళ ఉదయం ఆలయం వైపు ఒక్కరాసిగా పోటెత్తడంతో.. అధికారులు ఉదయం 3 గంట్లకు గేట్లను తెరిచి భక్తులను అనుమతించారు. ఈ విషయం తెలియడంతో లక్షల్లో భక్తులు ఒక్కసారిగా ఆలయంలోనికి ప్రవేశించారు.

ఇదే అదునుగా తీసుకున్న దొంగలు ఆలయ ప్రాంగణంలో చెలరేగిపోయారు. రద్దీలో చేరి దొంగతనాలకు పాల్పడ్డారు. దీంతో వందలాది మంది భక్తుల ఫోన్లు, పర్సులు, బంగారం.. ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రాణప్రతిష్ట ముగిసిన అనంతరం పోలీస్ బందోబస్తు తగ్గించారని, ఆ సమయంలో ఏర్పాటుచేసిన నిఘాను తొలగించారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. తమ వస్తువులు పోయిన విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.




Tags:    

Similar News