మోదీకి చాయ్ ఇచ్చిన రోబో.. వీడియో..

Update: 2023-09-27 13:39 GMT

మోదీ చాయ్ గురించి, చాయ్ రాజకీయాల గురించి మనకు తెలుసు. రాజకీయాల్లోకి రాకముందు చాయ్ పోసేవాడినని, అత్యంత సాధారణ కుటుంబం నుంచి వచ్చానని చెబుతుంటారు (Robot serves Tea  ). చాయ్ పే చర్చలు అంటూ హల్‌చల్ చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ కార్యక్రమాన్ని గుజరాత్ అధికారులు ఏర్పాటు చేశారు. ఓ రోబోతో మోదీకి చాయ్ ఇప్పించారు. ఆయన తెగ సంతోషపడుతూ టీకప్పు అందుకున్నారు. ఈ వీడియోను మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

గుజరాత్ ప్రభుత్వం అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘వైబ్రంట్‌ గుజరాత్‌ సమ్మిట్‌’ 20వ వార్షికోత్సవంలో మోదీ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ గ్యాలరీ విశేషాలు తెలుసుకున్నారు. అందులోని ఓ రోబో ఓ ట్రేలో స్నాక్స్, టీ కప్పుతో మోదీ దగ్గరికి వచ్చి ఆయనకు అందించింది. గ్యాలరీలోని రోబోలను, వాటి పనులను మోదీ ఆసక్తికరంగా తెలుసుకుంటూ ఫొటోలో తీసుకున్నారు. డీఆర్డీఓ తయారు చేసిన మైక్రోబోట్స్, అగ్రికల్చర్ రోబో, మెడికల్ రోబో, స్పేస్ రోబో వంటివాటిని ప్రదర్శనలో ఉంచారు. తను 2003లో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు తొలి వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సు జరిగిందటూ ఆ రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు కేంద్ర మంత్రులెవరూ ఆ కార్యక్రమానికి రాలేదని, తను అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే వారు రాజకీయాలు చేశారని కాంగ్రెస్‌ను పరోక్షంగా విమర్శించారు.కాగా అహ్మాదాబాద్‌లో నిర్మించిన అక్వాటిక్ గ్యాలరీని కూడా మోదీ సందర్శించారు. ఇందులో అరుదైన షార్క్ చేపలను ప్రదర్శిస్తున్నారు.


Tags:    

Similar News