ముస్లిం ఎంపీపై బీజేపీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు.. విపక్షాలు ఫైర్

By :  Kiran
Update: 2023-09-22 10:42 GMT

పార్లమెంటు స్పెషల్ సెషన్ లో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీఎస్పీకి చెందిన ఎంపీ డానిష్ అలీపై లోక్ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఆయనను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఎంపీ రమేష్ కామెంట్లపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపాలంటూ ఎంపీ డానిష్ అలీ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు.

చంద్రయాన్ -3 విజయంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయనను అయితే ఆ కామెంట్లను రికార్డుల నుంచి తొలగించారు. బిధూరీ వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ నేత జైరాం రమేష్ డానిష్ అలీపై రమేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పదాలను గతంలో ఎన్నడూ వినలేదని అన్నారు. కొత్త పార్లమెంటు భవనం ఇలాంటి మాటలతో ప్రారంభంకావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఓబీసీలను, ముస్లింలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు. ముస్లిం ఎంపీ పట్ల బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చెప్పారు. ఇలాంటి కామెంట్లతో దేశంలోని గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలకు తిలోదకాలిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రధాని

మరోవైపు ఎంపీ రమేష్ భిదూరీ కామెంట్లపై స్పీకర్‌ ఓంబిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ఈ అంశంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ క్షమాపణ కోరినా విపక్షాలు మాత్రం ఎంపీ రమేష్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News