దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న పెట్రోల్ ధరలను భరించలేక చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఆకర్షితులవుతున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ఇంట్రడ్యూజ్ చేస్తోంది. డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. లేటెస్టుగా దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. రెండేళ్లలో ఈ కంపెనీ నుంచి మొదటి విద్యుత్ బైక్ ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సంస్థనే ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. అందుకు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. 1,50,000 ఉత్పత్తి కెపాసిటీతో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కు భారత్ లో ఉన్న క్రేజే వేరు. యువతకు ఈ బైక్స్ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ అనే చెప్పాలి. వారి లైఫ్ లో ఒక్కసారైనా రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపాలని ఆశపడుతుంటారు. ఒక్క బైక్ ఆన్ రోడ్‌కు రావాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సిందే. అది రాయల్ ఎన్‌ఫీల్డ్ కు ఉన్న డిమాండ్. ప్రస్తుతం ఇండియాలోని మోటార్‌బైక్స్ మార్కెట్లో 90 శాతం వాటాతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది రాయల్ ఎన్‌ఫీల్ట్. అలాంటి సంస్థ ఇప్పుడు ఈవీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మార్కెట్ అవసరాలను అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు ఈ విద్యుత్ బైక్స్ ను రూపొందించబోతోంది సంస్థ. ప్రస్తుతం వీరి ఈవీ బైక్ పరీక్ష దశలో ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే మాత్రం కస్టమర్లకు పండగే. వినియోగదారులను ఆశ్చర్యపరిచే విధంగా ఈవీ బైక్ రూపొందిస్తున్నట్లు సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు.