Swami Prasad Maurya :లక్ష్మిదేవి నాలుగు చేతులతో ఎలా పుట్టింది?... ఎస్పీ నేత
దళితులు, బీసీలు తక్కువవాళ్లని రామచరిత మానస్ చెబుతోందని, దాన్ని నిషేధించాలని డిమాండ్ చేసి కలకలం రేపిన సమాజ్ వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఈసారి హిందువుల దేవత లక్ష్మీదేవిని టార్గెట్ చేసుకున్నారు. ప్రపంచంలోని అన్ని జాతుల ప్రజలు రెండు చేతులతోనే పుడతారని, మరి లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఎలా పుట్టిందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తుండడంతో మౌర్య ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువుల మనోభావాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్న మౌర్యపై చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేస్తున్నయి.
ఏమన్నారంటే..
ప్రసాద్ మౌర్య దీపావళి పండగ సందర్భంగా తన భార్యకు పూజ చేసి ఆ ఫోటోలోను ట్విటర్లో పోస్ట్ చేసి పెద్ద సందేశం ఇచ్చారు. ‘‘దీపోత్సవం సందర్భంగా నాకు భార్యకు పూజలు చేసి సన్మానం చేశాను ప్రపంచంలోని అన్ని మతాల్లో, కులాల్లో, జాతుల్లో, వివిధ రంగు జాతుల్లో పుట్టే ప్రతి బిడ్డకు రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు, ఒక ముక్కు, రెండు నాసికా రంధ్రాలు, ఒక పొట్ట, ఒక తల, ఒకపొట్టు, ఒక వెన్ను ఉంటాయి. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు ఉన్న బిడ్డ ఇప్పటి వరకు పుట్టలేదు. మరి లక్ష్మిదేవి నాలుగు చేతులతో ఎలా పుడుతుంది? మీరు నిజంగానే లక్ష్మీదేవిని పూజించాలనుకుంటే దేవతలాంటి మీ భార్యను పూజించండి. మీ కుటుంబ బాధ్యతలు నిర్వహింస్తూ మీ బాగోగులు చూసేదే మీ భార్యలే'' అని మౌర్య అన్నారు.
दीपोत्सव के अवसर पर अपनी पत्नी का पूजा व सम्मान करते हुए कहा कि पूरे विश्व के प्रत्येक धर्म, जाति, नस्ल, रंग व देश में पैदा होने वाले बच्चे के दो हाथ, दो पैर, दो कान, दो आंख, दो छिद्रों वाली नाक के साथ एक सिर, पेट व पीठ ही होती है, चार हाथ,आठ हाथ, दस हाथ, बीस हाथ व हजार हाथ वाला… pic.twitter.com/CP5AjKODfq
— Swami Prasad Maurya (@SwamiPMaurya) November 12, 2023