సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద కామెంట్స్

Byline :  Krishna
Update: 2023-09-03 04:33 GMT

ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు సీఎం స్టాలిన కొడుకు. సినీ కెరీర్ను పక్కనబెట్టి రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తండ్రి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే డీఎంకేపై హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్ర ఉంది. తాజాగా సనాతన నిర్మూలన సదస్సులో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ వివాదస్పద కామెంట్స్ చేశారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాదు పూర్తిగా నిర్మూలించాలన్నారు. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని చెప్పారు.

‘‘కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన ధర్మం కూడా అలాంటిదే. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం ప్రజల మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్‌ పిలుపునిచ్చారని బీజేపీ ఆరోపించింది. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..? అని ప్రశ్నించింది.

ఉదయనిధి స్టాలిన్ మాత్రం తన మాటలను సమర్ధించుకున్నారు. మారణహోమానికి తాను పిలుపునివ‍్వలేదని.. బలహీన వర్గాల పక్షాన మాట్లాడినట్లు చెప్పారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడాను. ఎలాంటి న్యాయపరమైన సవాల్నైనా ఎదుర్కొనేందుకు నేను సిద్ధం. కాషాయ బెదిరింపులకు మేము భయపడం. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి పోరాడుతూనే ఉంటాం’’ అని అన్నారు.

I never called for the genocide of people who are following Sanatan Dharma. Sanatan Dharma is a principle that divides people in the name of caste and religion. Uprooting Sanatan Dharma is upholding humanity and human equality.

Tags:    

Similar News