ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ బిగ్ స్కెచ్... మాజీ గవర్నర్ సంచలన కామెంట్స్

Update: 2023-08-06 02:42 GMT

"రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ ఎంతకైనా తెగిస్తాడు... రామ మందిరంపై బాంబులతో దాడి చేయొచ్చు.. బీజేపీ బడా నేతలను చంపే ప్లాన్ చేయొచ్చు"... ఇవన్నీ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలు కావు. సాక్షాత్తూ జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రధానిపై, బీజేపీ పై ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మోదీ ఏ పని చేయడానికీ వెనుకాడరన్నారు. ప్రజల సానుభూతి పొందడం కోసం ఇదంతా చేసే అవకాశం ఉందని... అయినా సరే వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి తప్పదని తేల్చి చెప్పారు. ఎన్నికల తర్వాత మోదీ అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అంటూ సత్యపాల్ మాలిక్ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

రాజకీయ మైలేజీని పొందేందుకు పీఎం మోదీ, బీజేపీ ఎంతకైనా తెగిస్తారని చెప్పారు సత్యపాల్ మాలిక్. అందులో భాగంగానే రామ మందిరంపై దాడి చేయడమో లేదంటే బీజేపీకి చెందిన అగ్ర నాయకుడిని చంపాడానికి ప్లాన్ చేస్తారని అన్నారు. ఇందుకోసం పాకిస్థాన్ కు చెందిన ఓ గ్రూప్ తో ఒప్పందం కుదర్చుకున్నారని... ఆ గ్రూప్ మరో నాలుగు ఐదు రోజుల్లో బోర్డర్ దాటి భారత్ లోకి వస్తుందన్నారు. సొంత పార్టీ నేతలపైనే దాడి చేయించే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ప్రధాని మోదీ అంటూ దుమారానికి తెరలేపారు.

మోదీ క్రూరమైన ఎన్నికల వ్యూహంపై విరుచుకుపడిన మాలిక్.. 2019 పుల్వామా దాడిని కూడా ప్రస్తావించారు. ఈ దాడిని ప్రధాని మోదీ ఉద్దేశపూర్వకంగా చేశారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలను నిర్వహించగల సామర్థ్యం ఉన్న ఎవరైనా రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ఏదైనా చేస్తారంటూ ఆయన అన్నారు. నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. 2019లో దాడి జరిగినప్పుడు మాలిక్ జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు.

మణిపూర్ హింసను కూడా ఆయన ప్రస్తావించారు మాలిక్ . దుర్మార్గులకు ఆయుధాలు అందించడం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించారు. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారని ప్రశ్నించగా.. హింసలో ఉపయోగించే ఆయుధాలు సామాన్యులకు అంత తేలికగా అందుబాటులో ఉండవని అన్నారు. ఐఎన్ఎస్ఏఎస్ రైఫిళ్లు మార్కెట్లో అందుబాటులో లేవని, ప్రభుత్వ పదాతిదళంలో ఉన్నాయని ఆయన ఉదహరించారు. అయితే మణిపూర్‌లో భద్రతా దళాల నుంచి ఆయుధాలను కుకీ తీవ్రవాదులు దోచుకున్నారనే వాదనలను సత్యపాల్ మాలిక్ తోసిపుచ్చారు.



Tags:    

Similar News